పేపర్, ఛానల్ ఉన్నాయి కదాని పిచ్చి రాతలు రాస్తే తాట తీస్తా: జగన్‌కు పవన్ హెచ్చరిక

  • పులివెందుల వేషాలు నా దగ్గర వేస్తే ఊరుకోను
  • నోటికొచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తా
  • రాజకీయాలు నేను చేయలేనా?
పేపర్, ఛానల్ ఉన్నాయి కదాని పిచ్చి రాతలు రాస్తే తాట తీస్తానని వైసీపీ అధినేత జగన్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. నేడు కైకలూరులో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్, విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు.

పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకునేది లేదన్నారు. నోటికి వచ్చినట్టు విజయసాయి మాట్లాడితే తాట తీస్తానన్నారు. రాజకీయాలు జగన్, చంద్రబాబులే చేస్తారా? తాను చేయలేనా? అని నిలదీశారు. కేసీఆర్ అనుమతితోనే వైసీపీ బీ-ఫారాలు అందజేస్తోందని పవన్ విమర్శించారు. త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, కొత్తతరం రాజకీయాలను తీసుకొస్తానన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jagan
Vijayasai Reddy
Chandrababu
Channel
Paper

More Telugu News